జాదవ్పూర్ వర్సిటీ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐకి ఏబీవీపీ షాక్
- విద్యార్థి సంఘం ఎన్నికల్లో తొలిసారి పోటీలోనే సత్తా
- ఎస్ఎఫ్ఐని కిందికి నెట్టి రెండో స్థానం
- ఇకముందు అన్ని స్టూడెంట్ యూనియన్ల ఎలక్షన్లలో పోటీకి నిర్ణయం
కోల్ కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీ (జేయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఎస్ఎఫ్ఐకి షాకిచ్చింది. కమ్యూనిస్టుల కంచుకోటగా భావించే జేయూలో మొదటి సారి పోటీ పడినప్పటికీ సత్తా చూపించింది. జేయూ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఎస్ఎఫ్ఐని వెనక్కు నెట్టి రెండో స్థానం కైవసం చేసుకుంది.